: అంబేద్కర్, నెహ్రూ అన్ని రకాల ఆహారాన్ని తిన్నారు: విద్యావేత్త కంచె ఐలయ్య
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు చాలా మంది మేధావులు అన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. నల్గొండ జిల్లా హోలియాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన సంఘం నియోజకవర్గ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పశు మాంసం తినడం తప్పు కాదని అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పాడి పరిశ్రమ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, మేధావులు బీఫ్ తిన్నవారేనని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిని పండగలా నిర్వహించడం కంటే ఉద్యమంలా నిర్వహించాలని ఆయన చెప్పారు.