: ఆపదలో ఆదుకున్న అతని పేరే తమ పాపకు పెట్టుకున్నారు!


వరదల బారినపడి ఎన్నో అనుభవాలను తన గుండెల్లో దాచుకున్న చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో చెన్నై వాసిని ఎవరిని కదిలించినా తన కుటుంబం అనుభవించిన కష్టాల గురించే చెబుతున్నారు. అదే సమయంలో దేవుడిలా వచ్చి సాయపడిన మనుషులను తలచుకుని చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. వురపక్కమ్ ప్రాంతానికి చెందిన మోహన్ కథ కూడా అలాంటిదే. అతని భార్య నిండుచూలాలు. ఇంటి చుట్టూ నీరు చేరుకుంది. ఇంతలో భార్య చిత్రకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అదే సమయంలో అటుగా స్నేహితుల కోసం వచ్చిన యూనస్ చిత్రను చూశాడు. స్నేహితుల సంగతి పక్కన పెట్టి, నొప్పులతో బాధపడుతున్న చిత్రను బోటులో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో మోహన్, చిత్ర దంపతులు కష్టంలో అండగా నిలిచిన యూనస్ పేరునే పాపకు పెట్టాలని నిర్ణయించారు. అదే విషయాన్ని అతనికి ఫోన్ చేసి తెలిపారు.

  • Loading...

More Telugu News