: నా ఉంగరాల జుట్టును ఎంతో మంది మెచ్చుకున్నారు: తాప్సీ


తాను మోడలింగ్ చేసినప్పటి నుంచి కూడా అందరూ తన ఉంగరాల జుట్టును తెగ మెచ్చుకునేవాళ్లని టాలీవుడ్ నటి తాప్సీ చెప్పింది. నిర్మల్ హెయిర్ ఆయిల్ అనే యాడ్ లో నటించే అవకాశం తాప్సీకి లభించింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, ‘మా అమ్మ పేరు నిర్మల. నేను యాడ్ లో నటిస్తున్న ఉత్పత్తి పేరు కూడా ఈ పేరుతోనే ఉంది. అందుకే ఈ యాడ్ లో నటించేందుకు ఒప్పుకున్నాను. నాకు ఉంగరాల జుట్టు ఉండటంతో, మొదటి నుంచి నన్ను ప్రశంసించేవారు. అందుకే ఈ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు’ అని తాప్సీ పేర్కొంది.

  • Loading...

More Telugu News