: దమ్ముంటే గ్రేటర్ లో పోటీకి రండి: నాయిని సవాల్


ప్రతిపక్ష నేతలకు టీఎస్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగాలని ఛాలెంజ్ చేశారు. హైదరాబాదులోని అడిక్ మెట్ లో డివిజన్ పార్టీ కార్యాలయాన్ని నేడు నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో... కేసీఆర్ ను హత్య చేయడానికి సీమాంధ్ర గూండాలు కుట్రలు పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. 60 ఏళ్ల చరిత్రను కేవలం 18 నెలల పాలనలో మరిపించిన ఘనత కేసీఆర్ ది అని చెప్పారు.

  • Loading...

More Telugu News