: మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు బులియన్ మార్కెట్ పైనా ప్రభావం చూపాయి. మంగళవారం నాడు భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో విలువైన లోహాల ధరలు మరింతగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 175 తగ్గి రూ. 25,775కు చేరింది. యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో జరపనున్న పరపతి సమీక్ష, క్రూడాయిల్ ధరల సరళి బులియన్ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆభరణాల తయారీదారులు, జ్యూయలర్స్ నుంచి డిమాండ్ తగ్గిందని తెలిపారు. కాగా, కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 575 తగ్గి 34,425కు చేరింది.