: ఆ పాటతో చైనాకు వణుకు!


'జిహాదాలజీ' అనే వెబ్ సైట్ లో నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఒక పాట చైనాకు వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ, ఆ పాట ఎవరిదో తెలుసా? ఆకస్మిక దాడులతో మారణహోమం సృష్టిస్తున్న, ప్రపంచ దేశాలకు సవాల్ గా నిలిచిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పాట అది. ఐఎస్ కన్ను ఇప్పుడు చైనా దేశంపై పడింది. అక్కడ తమ ప్రాబల్యం, పట్టు పెంచుకోవాలన్న నేపథ్యంలో భాగంగా ఈ పాటను సదరు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. చైనాలోని ముస్లింలను ఉద్దేశించి ఉన్న 'ఐ యామ్ ముజాహిద్' అనే పాటను షేర్ చేసింది. ‘ఆయుధాలతో యుద్ధానికి సిద్ధం కండి’ అంటూ కొనసాగే ఈ పాట నిడిని నాలుగు నిమిషాలు. కాగా చైనాలో టీచర్‌గా పనిచేస్తున్న ఫాన్ జింగ్హుయ్‌ను గతంలో ఇస్లామిక్ స్టేట్ కిడ్నాప్ చేసి హతమార్చిన తర్వాత చైనా తన ధోరణిని మార్చుకుంది. ఈ తాజా వ్యవహారంతో చైనా మండిపడుతోంది.

  • Loading...

More Telugu News