: హత్య కేసులో పిస్టోరియస్ కు బెయిలు


ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో పారాలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ కు బెయిలు లభించింది. అతను దేశం విడిచిపోకుండా ఉంటాడని అతని తరపున న్యాయవాది వాదించడంతో జడ్జి లెడ్ వాబా ఏకీభవించి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలో 500 యూరోల పూచికత్తుతో బెయిలు మంజూరు చేశారు. దీంతో అతనికి ఎలక్ట్రికల్ టాగ్ ను అమర్చి ఇంటికి 20 కిలో మీటర్ల దూరంలో మాత్రమే సంచరించే అవకాశం కల్పించారు. అంతేగాక పిస్టోరియస్ పాస్ పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో అతడిని ఆ దేశ సుప్రీంకోర్టు దోషిగా తేల్చడంపై అప్పీల్ కు వెళ్లనున్నట్టు అతని న్యాయవాది తెలిపాడు.

  • Loading...

More Telugu News