: ఇక కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను కలిపి చూపిస్తా: చంద్రబాబు


నధుల అనుసంధానానికి ఇండియాలో మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తి కావడం తనలో ఎంతో స్ఫూర్తిని నింపిందని అన్నారు. అదే స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో పారుతున్న కృష్ణ, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. 2018లోగా పోలవరం హెడ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని వివరించారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో కరవు అన్న మాట లేకుండా చేయడమే తన ఉద్దేశమని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News