: క్వాలిటీ ఫుడ్ లో ఏపీ గుడ్... తెలంగాణకు 22వ స్థానం!


తెలంగాణతో పోలిస్తే ఆహార ఉత్పత్తుల నాణ్యత స్థానంలో ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆహార నాణ్యతపై ఎటువంటి తనిఖీలు సక్రమంగా జరగడం లేదన్న విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వార్షిక నివేదిక- 2015ను విడుదల చేసింది. ఆహార నాణ్యత విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 22వ స్థానం లభించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన వార్షిక నివేదిక గత నవంబర్ 24, 2015 వరకు వర్తిస్తుంది. తెలంగాణకు సంబందించి 312 ఫుడ్ శాంపిల్స్ ను, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి 2,788 ఫుడ్ శాంపిల్స్ నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలలో పరీక్షించారు. తెలంగాణ నుంచి ఎక్కువ ఫుడ్ శాంపిల్స్ రాలేదని, ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు విఫలమయ్యారని ఆరోగ్య కార్యకర్త, బక్కా జుడ్సన్ పేర్కొన్నారు. ఫుడ్ శాంపిల్స్ లో కల్తీ లేదా అపరిశుభ్ర ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో త్రిపుర, అస్సాం, బీహార్ వంటి చిన్న రాష్ట్రాల కన్నా తెలంగాణ వెనుకబడి ఉందన్నారు.

  • Loading...

More Telugu News