: హైదరాబాద్ విచ్చేసిన మారిషస్ ప్రెసిడెంట్
మారిషన్ అధ్యక్షురాలు బీబీ అమీనా ఫిర్ దౌస్ గురిబ్ ఫాఖిమ్ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె భాగ్యనగరానికి విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు టీఎస్ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆమె నేరుగా ఫలక్ నుమా ప్యాలస్ కు బయల్దేరి వెళ్లారు. మారిషస్ ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో, రెండు రోజుల పాటు నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, దారి మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.