: ఇంటెక్స్ కు రాజ్ కోట్ ఫ్రాంచైజీ.. గోయెంకాకు పుణే జట్టు


విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న జట్లను ఖరారు చేస్తూ బీసీసీఐ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆయా జట్లను దక్కించుకున్న యాజమాన్యాలను కూడా బీసీసీఐ ప్రకటించింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం ఇంటెక్స్ ... రాజ్ కోట్ ఫ్రాంచైజీని దక్కించుకోగా, పుణే ఫ్రాంచైజీని గోయెంకా గ్రూప్ చేజిక్కించుకుంది. ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వాలని పెద్ద సంఖ్యలో కార్పొరేట్ దిగ్గజాలు యత్నించినప్పటికీ ఇంటెక్స్, గోయెంకా గ్రూపులే విజయం సాధించాయి. రూ.16 కోట్లను వెచ్చించిన సంజీవ్ గోయెంకా... రాజ్ కోట్ ఫ్రాంచైజీని దక్కించుకోగా, పుణే ఫ్రాంచైజీ కోసం ఇంటెక్స్ సంస్థ రూ.10 కోట్లను చెల్లించనుంది.

  • Loading...

More Telugu News