: కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటాకోసం పోరాటం చేస్తాం: ఎంపీ వినోద్


కృష్ణానదీ జలాల పంపిణీలో న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. జలాల పునఃపంపిణీ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం సరికాదని మీడియా సమావేశంలో చెప్పారు. కేంద్ర వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నదీ జలాల పంపిణీ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం ఈరోజు ప్లేటు ఫిరాయించిందని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందని వినోద్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News