: కల్తీ మద్యం బాధితులకు అమ్మకందారుల నుంచే పరిహారం ఇప్పిస్తాం: చినరాజప్ప


విజయవాడలో కల్తీ మద్యం బారినపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం చినరాజప్ప ఈరోజు పరామర్శించారు. కల్తీ మద్యం అమ్మకందారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం విక్రయదారుల నుంచే బాధితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కల్తీ మద్యం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిందిగా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలిచ్చామని చినరాజప్ప తెలిపారు. మరోవైపు డీజీపీ జేవీ రాముడు కూడా మద్యం బాధితులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News