: చెన్నై వరద బాధితులకు ఈసారి రజనీకాంత్ సాయం రూ.10 కోట్లు
చెన్నై వరద బాధితులకు ఈసారి నటుడు రజనీకాంత్ భారీ సాయం ప్రకటించారు. మొదట తను నిర్వహిస్తున్న 'శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా రూ.10 లక్షలు ప్రకటించారు. తాజాగా ఆయన మరో రూ.10కోట్లు విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్ర సీఎం జయలలితను కలసి రూ.10కోట్ల 10 లక్షల సాయాన్ని రజనీ చెక్కు రూపంలో అందజేశారు. సూపర్ స్టార్ అయ్యుండి పది లక్షల విరాళమే ఇచ్చారంటూ పలువురి నుంచి విమర్శలు రావడంతో మళ్లీ పది కోట్లు ఇచ్చారు.