: ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు... వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన ఈఎంయూ, పలువురి మృతి


హరియానాలోని పల్వల్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. ముంబై నుంచి హరిద్వార్ వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈఎంయూ షటిల్ ఢీకొనగా, ఈఎంయూ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఈఎంయూ షటిల్ అసోటి నుంచి పల్వాల్ వస్తోంది. ముందు వెళుతున్న రైలు నెమ్మదిగా నడుస్తోందని, వెనుక నుంచి వచ్చిన ఈఎంయూ దాన్ని బలంగా తాకిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ పరిస్థితి బీతావహంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మరణించారని, ఎంతమంది మరణించారన్న విషయం ఇప్పటికిప్పుడు నిర్ధారించలేమని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News