: చైనా భాషలో ఒక అక్షరం మారడంతో అధ్యక్షుడి 'రాజీనామా' అయిపోయింది!
అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రాజీనామా... చైనా వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం. పలు వెబ్ సైట్లు, టీవీ చానళ్లలో ఫ్లాష్ న్యూస్. ఈలోగా తెలిసిన మరో నిజం. జిన్ పింగ్ రాజీనామా చేయలేదని! తప్పును సరిచేసుకున్నా, అప్పటికే కొన్ని వందల వెబ్ సైట్లలోకి వార్త చేరిపోయి ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఇంతకీ అసలేమైందంటే, చైనా - ఆఫ్రికా సదస్సులో భాగంగా జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన సదస్సులో జిన్ పింగ్ ప్రసంగించారు. చైనా భాషలో 'ప్రసంగం' అన్న పదంలో ఒక్క క్యారెక్టర్ మారితే అది 'రాజీనామా' అయిపోతుందట. ఆ ప్రసంగాన్ని కవర్ చేసిన చైనా న్యూస్ సర్వీస్ కూడా అదే తప్పు చేసింది. దీంతో పెను దుమారమే చెలరేగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ, నలుగురు ఉద్యోగులను సదరు వార్తా సంస్థ తొలగించినట్టు తెలుస్తోంది.