: ఢిల్లీలో రామోజీరావు... ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు


‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకూరి రామోజీరావు నిన్న ఢిల్లీలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో ఆయన నిన్న బిజీబిజీగా గడిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన ఆయన మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని సర్కారీ ఆసుపత్రుల్లో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రధానికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా ఆయన మోదీకి అందజేశారు. తమ సంస్థ చేపట్టిన చర్యల వల్ల సర్కారీ ఆసుపత్రుల్లో వచ్చిన గుణాత్మక మార్పులను వివరించే డీవీడీని కూడా రామోజీ ప్రధానికి అందజేశారు. వాటిని ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ప్రధానితో భేటీకి ముందు రామోజీరావు పార్లమెంటు ఆవరణలోనే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రామోజీ కలిసిన మంత్రుల్లో వెంకయ్యనాయుడు, రాధామోహన్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, స్మృతి ఇరానీ, కల్ రాజ్ మిశ్రా, మహేశ్ శర్మ, వీకే సింగ్ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News