: నెటిజన్లను ఆకట్టుకుంటున్న బ్రిటన్ లోని దృశ్యం
బ్రిటన్ లో చోటుచేసుకున్న ఓ చిత్రమైన దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా వాటర్ ఫాల్స్ అంటే కొండలు, ఎత్తైన ప్రదేశాల నుంచి కిందికి ఉరికే జలపాతాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అలాంటిది జలపాతం నేలపై నుంచి కొండలపైకి వెళ్లిపోతే? అది అసాధ్యం కదా? కానీ బ్రిటన్ లోని పీక్ అనే జిల్లాను గత కొంత కాలంగా వరదలు వణికిస్తున్నాయి. ఇక్కడ వీచే గాలులు, కురుస్తున్న వర్షాల ధాటికి ఇక్కడికి చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి అత్యంత కష్టం మీద ఆ ప్రాంతానికి వీడియో కెమెరాతో చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఓ అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. దానిని చూసి మంత్ర ముగ్ధుడైన ఆయన దానిని చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టారు. అక్కడ వీస్తున్న బలమైన గాలుల ధాటికి కిందికి రావాల్సిన జలపాతం కొండెక్కుతున్నట్టు కనిపించిన ఆ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.