: హైదరాబాదులో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాదులో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మారిషస్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ అమీనా ఫిర్దాస్ గురిబ్ ఫకిం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జంట కమిషనరేట్ల పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉండనున్నట్లు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు ఉండే ప్రాంతాల వివరాలు.. మంగళవారం రోజున... రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి హోటల్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వైపు ఉండే ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య, హోటల్ ఫలక్ నుమా నుంచి గోల్కొండ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 గంటల మధ్య, గోల్కొండ కోట నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ మార్గంలో సాయంత్రం 4.15 నుంచి 5.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వెళ్లే మార్గంలో 6.30 నుంచి 19.15 గంటల మధ్య ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉంటాయి. బుధవారం రోజున... హోటల్ ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గంలో ఉదయం 10.45 నుంచి 11.30 గంటల మధ్య, చార్మినార్ నుంచి సాలార్ జంగ్ మ్యూజియం దారిలో ఉదయం 11.30 నుంచి 11.45 గంటల మధ్య, సాలార్జంగ్ మ్యూజియం నుంచి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లే మార్గంలో 12.15 నుంచి ఒంటి గంట మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 3.45 నుంచి 4.30 గంటల సమయం మధ్య ట్రాపిక్ మళ్లించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News