: కల్తీ మద్యం ఘటనలో స్వర్ణబార్, ఎం.హోటల్ సిబ్బంది అరెస్ట్... బార్ సీజ్


విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కల్తీ మద్యం ఘటనలో స్వర్ణబార్, ఎం.హోటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. స్వర్ణబార్ ను కూడా సీజ్ చేశారు. కాగా, కల్తీ మద్యం తాగిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, 18 మంది అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్యం బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అయితే ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News