: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ...ట్రయల్ కోర్టుకు హాజరవ్వాలని ఆదేశం!


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ముందు హాజరయ్యేందుకు తమకు మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. కేసు విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు ముందు హాజరుకావల్సిందేనని సోనియా, రాహుల్, మరో నలుగురికి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వారందరికీ ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో సోనియా అభ్యర్థన సమంజసంగా లేదని పేర్కొంది. దాంతో రేపు కోర్టు ముందు హాజరుకావల్సిందేనని తెలిపింది.

  • Loading...

More Telugu News