: చెన్నై ఎయిర్ పోర్టును పరిశీలించిన అశోక్ గజపతిరాజు
వారం రోజుల తరువాత ఈ రోజు నుంచి సర్వీసులు పునరుద్ధరించిన చెన్నై విమానాశ్రయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సందర్శించారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా విమానాశ్రయం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయంలో విమాన రాకపోకలు, వరదల కారణంగా విమానాశ్రయానికి కలిగిన నష్టాన్ని, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆయన తమిళనాడు సీఎం జయలలితతో భేటీ కానున్నారు.