: ఆ బార్ నాది కాదు... నా బంధువులది: మల్లాది విష్ణు ప్రకటన
విజయవాడ కృష్ణలంక బార్ కల్తీ మద్యం ఘటనలో బార్ యజమానిగా ప్రచారం సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా ముందుకు వచ్చారు. వార్తా చానెళ్లలో ప్రచారం సాగుతున్నట్టుగా స్వర్ణ బార్ తనది కాదని, అది తన బంధువులది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన తేల్చిచెప్పారు. బార్ తన బంధువులది అయినప్పటికీ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన చెప్పారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అయితే బార్ తో గాని, బార్ కార్యకలాపాలతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.