: కల్తీ మద్యం ఘటనలో 5కు పెరిగిన మృతుల సంఖ్య ... 20 మందికి పైగా అస్వస్థత


విజయవాడ కల్తీ మద్యం ఇప్పటిదాకా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. నేటి ఉదయం నగరంలోని కృష్ణలంక కేంద్రంగా ఏర్పాటైన స్వర్ణ బార్ లో మద్యం సేవించిన ఘటనలో తొలుత ముగ్గురు దుర్మరణం పాలు కాగా, తాజాగా మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మద్యం సేవించిన వారిలో కొందరు తీవ్ర తలనొప్పితో బాధపడుతుండగా, మరికొందరు వాంతులు చేసుకుంటున్నారు. ఇంకొందరు నోట్లో నుంచి నురగలు కక్కుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కల్తీ మద్యం సేవించిన కారణంగా అస్వస్థతకు గురైన వారి సంఖ్య 20కి చేరింది. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News