: లిఫ్ట్ తెగిపడి మంత్రి తలసానికి స్వల్ప గాయాలు... తప్పిన ముప్పు


తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో ఆయన ఎక్కిన లిఫ్ట్ వైర్ తెగడంతో... లిఫ్టు కిందకి పడిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు వెళుతున్న సమయంలో, లిఫ్ట్ కొంచెం పైకి పోయిన వెంటనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మంత్రితో పాటు భద్రతా సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు సహా 12 మంది ఉన్నారు. ఈ ఘటనతో లిఫ్ట్ లో ఉన్నవారంతా ఒక్కసారిగా అదిరిపడ్డారు. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది, అధికారులు లిఫ్ట్ తలుపులను తొలగించి మంత్రిని బయటకు తెచ్చారు. తలసానితో పాటు మిగతావారికి కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిసింది. టీఆర్ఎస్ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్ బేగ్ తండ్రి మీర్జా అమానుల్లా బేగ్ అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలోని ఫస్ట్ ఫ్లోర్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News