: కదిలిన కాంగ్రెస్ దండు, ముందు నిలిచిన రాహుల్


దళితులను కుక్కలతో పోల్చిన ఎన్డీయే మంత్రి వీకే సింగ్ కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదంటూ, ఆయన రాజీనామాకై డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ తదితరులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "బడుగులను కుక్కలతో పోల్చిన వ్యక్తికి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు. ప్రధాని తక్షణం ఆయన్ను పదవి నుంచి తొలగించాలి" అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో సైతం ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, ఫరీదాబాద్ లో ఇద్దరు దళిత చిన్నారులను సజీవదహనం చేసిన తరువాత "ఎవరైనా కుక్కలపై రాళ్లు విసిరితే, దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు" అని వీకే సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News