: అమరావతికి చెన్నై తరహా ముప్పు పొంచి ఉందంటున్న కేవీపీ
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి చెన్నై తరహా ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని ఆయన చెప్పారు. రాజ్యసభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాలనుకున్నానని, కానీ కుదరలేదని అన్నారు. రాజధానిని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మించినా సరే చెన్నై కన్నా అమరావతికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలున్నాయని చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ముప్పు లేని నగరాన్ని అందించాలని, జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదని కేవీపీ హెచ్చరిక చేశారు. అయితే రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం వల్ల కొంతమందికి కలిగే ప్రయోజనాల గురించి తాను మాట్లాడనన్నారు.