: అమితాబ్ ను ఎంచుకుని పెద్ద తప్పు చేశా: రాంగోపాల్ వర్మ


ఆగ్, నిశ్శబ్ద్ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ ను తీసుకుని తాను పెద్ద తప్పు చేశానని రాంగోపాల్ వర్మ తాను ఇటీవల రాసిన 'గన్స్ అండ్ థైస్' పుస్తకంలో ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో అమితాబ్ తో తన అనుభవాలను 'మై లవ్ ఎఫైర్ విత్ అమితాబ్ బచ్చన్' పేరిట ఓ అధ్యాయంలో వివరిస్తూ, తాను బచ్చన్ ను ఓ సూపర్ స్టార్ గా మాత్రమే చూశానని, ఆయనలోని అసలు నటుడిని ఆవిష్కరించే ప్రయత్నంలో ప్రయోగం చేశానని చెప్పుకొచ్చాడు. ఆయన ప్రతిభను తాను ఆవిష్కరించలేకపోయానని, అందువల్లే చిత్రాలు విఫలమయ్యాయేతప్ప, నటుడిగా ఆయన విఫలం కాలేదని అన్నారు. తనపై విశ్వాసం ఉంచిన అమితాబ్ ఆ పాత్రలు చేసేందుకు అంగీకరించారని, తానే ఆయన్ను ఎంచుకుని తప్పు చేశానని తెలిపాడు.

  • Loading...

More Telugu News