: ముగ్గురు తప్ప అందరూ బౌలింగ్ చేశారు... అయినా డిఫెన్స్ వదలని దక్షిణాఫ్రికా!


భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టును ఎట్టి పరిస్థితుల్లోను డ్రాగా ముగించాలని చూస్తున్న దక్షిణాఫ్రికా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతగా డిఫెన్స్ కు మాత్రమే పరిమితమైంది. వారి వికెట్లు తీసేందుకు, పరాజయాన్ని పరిపూర్ణం చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నాడు. ఇందులో భాగంగా బ్యాట్స్ మెన్ల చేత కూడా బౌలింగ్ ప్రయోగాలు చేయిస్తున్నాడు. మొత్తం 11 మంది ఆటగాళ్లలో కీపర్ సాహాను పక్కన బెడితే, మిగతా 10 మందిలో ఎనిమిది మంది చేత బౌలింగ్ చేయించాడు. అయినా దక్షిణాఫ్రికా కొరుకుడు పడకుండా ఉంది. సాహాతో పాటు రహానే, రోహిత్ శర్మలు మాత్రమే బౌలింగ్ కు రాలేదు. ప్రధాన బౌలర్లు ఇషాంత్, అశ్విన్, జడేజా, యాదవ్ లతో పాటు ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్, పుజారాలతో బౌలింగ్ వేయించిన కోహ్లీ, తాను కూడా వచ్చి ఓ చెయ్యేశాడు. మరో 54 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుకుంటే, దక్షిణాఫ్రికా ఈ టెస్టును డ్రాగా ముగించుకోగలుగుతుంది.

  • Loading...

More Telugu News