: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా... మన్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు


ఈ నెల 26న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ మీడియాకు ఆ పార్టీ ఏవోబీఎస్ జడ్ సీ కార్యదర్శి చంద్రమౌళి ఓ లేఖను విడుదల చేశారు. 21 నుంచి 27 వరకు నిరసన దినాలు పాటించాలని ప్రజలకు ఈ లేఖలో ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు బాక్సైట్ గనులను ఆన్ రాక్ కి అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నాయని అందులో ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు దేశంలోని అపార ఖనిజ సంపదను అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నాయని చంద్రమౌళి విమర్శించారు.

  • Loading...

More Telugu News