: ఇక స్టార్ ఇండియా, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి... ఐపీఎల్ జట్ల కోసం బిడ్ల కొనుగోలు


ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు బారులు తీరుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల స్థానంలో కొత్తగా రెండు జట్ల ఎంట్రీకి బీసీసీఐ ఇప్పటికే వేలం ప్రక్రియను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 21 బిడ్లు అమ్ముడుబోయాయి. చెన్నైకి చెందిన కార్పొరేట్ దిగ్గజం చెట్టినాడు సిమెంట్స్ ఓ బిడ్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక క్రికెట్ మ్యాచ్ ల ప్రసారంలో మెజారిటీ హక్కులు చేజిక్కించుకున్న స్టార్ ఇండియా కూడా ఓ బిడ్డును కొనుగోలు చేసింది. మరోవైపు అగర్ బత్తి రంగంలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థ ‘సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి’ కూడా ఓ బిడ్ ను కొనుక్కుంది. అధిక ధర కోట్ చేసిన సంస్థల్లో ఒక్కో కార్పొరేట్ కు ఓ జట్టును కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి వేలంలో ఏ కార్పొరేట్ దిగ్గజం ఐపీఎల్ లో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News