: చంద్రబాబు, నటశేఖర కృష్ణ బంధువులయ్యారు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.., టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ బంధువులయ్యారు. ఇప్పటికే కృష్ణ తన పెద్ద కూతురు పద్మజను వ్యాపార రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ కీలక భూమిక పోషిస్తున్న గల్లా అరుణకుమారి కుమారుడు, ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ఇచ్చి పెళ్లి చేశారు. తాజాగా చంద్రబాబు సోదరి హైమావతి మనవరాలు ప్రియాంకతో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుల పెళ్లి ఖరారైంది. ఈ మేరకు ఇరు కుటుంబాలు ఇప్పటికే ముహూర్తాలను కూడా నిర్ణయించుకున్నాయి. నిన్న హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసిన ఇరు కుటుంబాల సభ్యులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ప్రియాంక ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేయగా, రత్నబాబు ఇప్పటికే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వ్యాపారం రంగంలో ఉన్నారు.