: డిసెంబర్ 8న చెన్నైలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 8న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తిరిగి బాధితులను పరామర్శించనున్నారు. గత పది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసి, చెన్నై వాసులను తీవ్ర ఇక్కట్ల పాలు చేసిన వర్షం నిన్నటి నుంచి కాస్త తెరిపిచ్చింది. దీంతో రేపటి నుంచి చెన్నైలో పరిస్థితులన్నీ మెరుగుపడనున్నాయి. రేపటి నుంచి రైల్వే వ్యవస్థను పునరుద్ధరించనున్నారు. అలాగే ఈరోజు పగటి పూట మాత్రమే నడిచిన విమాన సర్వీసులు, రేపటి నుంచి రాత్రి పూట కూడా నడుస్తాయి.