: వారికి బాధ్యత లేదు...సహకరించలేదు: ఆర్మీ అధికారులు


చెన్నై వరద బాధితులకు ఏ రకంగానైనా సహాయపడాలని దేశం యావత్తు భావించింది. వారందరి బాధ్యతను భుజానికెత్తుకున్న ఇండియన్ ఆర్మీ జవానులకు చెన్నైలోని టీనగర్ అధికారుల వ్యవహారశైలి ఆగ్రహం తెప్పించింది. చెన్నైలోని ముంపు ప్రాంతాలకు సహాయకచర్యలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆర్మీ సిబ్బందికి స్థానిక అధికారులు సరైన సమాచారం అందించకపోవడంతో ఆరు గంటలపాటు సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఎటువైపు వెళ్లాలో కూడా ఎవరూ చెప్పలేదని ఆర్మీ అధికారులు మండిపడ్డారు. దీనిపై స్థానిక అధికారులకు సమాచారం అందించినా వారు పెద్దగా స్పందించలేదని వారు వెల్లడించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వారి నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పించిందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News