: అంగారక గ్రహానికి లేఖ రాయాలని భావించి, నిరాశ చెందిన ఐదేళ్ల బాలుడు


లండన్ కు చెందిన ఐదేళ్ల బాలుడు ఒలీవర్ గిడ్డింగ్స్ భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకుంటున్నాడు. అందులోను అంగారక గ్రహం మీదకు వెళ్లాలనేది అతని బలమైన కోరిక. అయితే, ఆ లోపు ఓ ఉత్తరం రాసి అంగారకుడిపైకి పంపాలని భావించాడు. దీంతో అంగారకుడిపైకి ఉత్తరం పంపాలనుకుంటున్నానని, దానికి ఎంత ఖర్చవుతుందో చెప్పాలంటూ బ్రిటన్ కు చెందిన 'రాయల్ మెయిల్'కు ఓ లేఖ రాశాడు. ఈ విషయం వారికీ తెలియదు. దీంతో దీనికి సమాధానం చెప్పాలంటూ నాసాకు రాయల్ మెయిల్ ఓ లేఖ రాసింది. దీనికి సమాధానంగా, వంద గ్రాముల బరువున్న వస్తువును అంగారకుడిపైకి పంపాలంటే 18 వేల డాలర్లు ఖర్చవుతుందని నాసా తెలిపింది. క్యూరియాసిటీ రోవర్ ను పంపేందుకు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు చెప్పింది. ఆ లెక్కన ఓ లేఖ అంగారకుడిపైకి పంపాలంటే మొత్తంగా సుమారు 23,860 అమెరికన్ డాలర్లు అంటే 15,90,000 రూపాయలు ఖర్చవుతాయని చెప్పింది. ఇదే విషయాన్ని రాయల్ మెయిల్ ఒలీవర్ కు తెలిపింది. రాయల్ మెయిల్ పంపిన లేఖ చదివి నిరాశ చెందినా, ధన్యవాదాలు చెబుతూ రాయల్ మెయిల్ కు లేఖ రాశాడు ఆ బుడతడు.

  • Loading...

More Telugu News