: భారత్ లో ప్రజాదరణ పొందిన యాప్స్ ఇవే...!


భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్ ఏవంటూ 'విచ్ యాప్' సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 20,000 మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అభిప్రాయాలను తీసుకున్నారు. అత్యధికులు ఏ యాప్ లో యాక్టివ్ గా ఉన్నారు? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్టు విచ్ యాప్ తెలిపింది. ఈ సర్వేలో ఎక్కువ మంది భారతీయ వినియోగదారులు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకే ఓటేసినట్టు విచ్ యాప్ తెలిపింది. అత్యధికులు ఈ రెండు యాప్స్ వినియోగిస్తున్నట్టు తెలపగా, వీటితో పాటు మిక్స్ ప్లేయర్, ఫ్లిప్ కార్ట్, క్యాండీ క్రష్, యాప్ లాక్, నౌకరీ.కామ్ లను ఇన్ స్టాల్ చేసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News