: కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్ పై దాడి
ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్ పై దాడి జరిగింది. మెహ్రౌలీ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు జగదీష్ టైట్లర్ హాజరయ్యారు. ఈ వేడుకలో ఉమంగ్ భాటియా (23) అనే యువకుడు జగదీష్ టైట్లర్ పైకి గ్లాసు విసిరి దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కుల ఊచకోతకు ఆయనే కారణమని ఆరోపిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో భాటియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందిరాగాంధీ మరణం తరువాత 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.