: ఆనాటి నా ఆలోచనే నేడు కేజ్రీవాల్ కు తట్టింది: జైరాం రమేశ్
దేశ రాజధానిలో ప్రైవేటు వాహనాలను సరి, బేసి సంఖ్యలను బట్టి రోజు విడిచి రోజు రోడ్లపైకి అనుమతించాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని 'మంచి అడుగు'గా కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. తాను ఇదే సలహాను ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ కొనసాగుతున్న సమయంలో ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఆనాటి తన ఆలోచన నేడు అమలు దిశగా సాగుతోందని అన్నారు. రెండు రోజుల 'గ్లోబ్ కాప్21' సదస్సులో పాల్గొనేందుకు పారిస్ చేరుకున్న జైరాం రమేశ్, కేవలం ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఈ నిబంధన విధిస్తే సరిపోదని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు సైతం ఈ నిర్ణయాన్ని పాటిస్తేనే, ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.