: ఐఎస్ఐఎస్ పైకి టైపూన్స్, టోర్నడో!


ఉగ్రవాదుల అంతం చూడటమే లక్ష్యంగా బ్రిటన్ విజృంభిస్తోంది. సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపైకి టైపూన్స్, టోర్నడో అనే పేరున్న రెండు యుద్ధ విమానాలను పంపింది. ఈ రెండు ఫైటర్ జెట్ విమానాలూ సిరియా, ఇరాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబులు కురిపిస్తున్నాయి. సిప్రస్ పరిధిలోని అక్రోతిరి, ఒమర్ ప్రాంతంపై ఈ యుద్ధ విమానాలు దాడులు చేశాయని, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాగున్నారని సమాచారమందిన ప్రాంతాలపైకి బాంబులు వేశాయని బ్రిటన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా, తొలుత ఒక యుద్ధ విమానంతో దాడులు ప్రారంభించిన బ్రిటన్, దానికి సహాయంగా ఉండేందుకు రెండో విమానాన్ని రంగంలోకి దించింది. ఇప్పటికే ఫ్రాన్స్, రష్యా విమానాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలతో పాటు తాజాగా బ్రిటన్ కూడా ఐఎస్ఐఎస్ పై సమరశంఖం పూరించింది.

  • Loading...

More Telugu News