: వాస్తవాధీన రేఖనే సరిహద్దుగా మార్చుకుంటే సమస్య పరిష్కారమవుతుంది!: ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్, పాక్ దేశాలు శాంతిని కాపాడే దిశగా అడుగులు వేయాలని సలహా ఇచ్చిన ఆయన, వాస్తవాధీన రేఖనే సరిహద్దుగా నిర్ణయించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 110వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పాక్ అధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకునే అవకాశాలే లేవని అన్నారు. రెండు దేశాల వద్దా అణుబాంబులు ఉన్నాయని, వాటితో సమస్యను పరిష్కరించుకోలేరని అభిప్రాయపడుతూ, జమ్మూకాశ్మీర్ ప్రజల కోసం ఎల్ఓసీనే సరిహద్దులుగా చేసుకోవాలని అన్నారు. ఇటీవల ఫరూక్ ఇవే వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ తీవ్రంగా మండిపడ్డ సంగతి తెలిసిందే.