: సెంచరీ ముంగిట బోల్తాపడ్డ కోహ్లీ


సెంచరీ చేస్తాడనుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బోల్తా పడ్డాడు. అబాట్ వేసిన బంతికి వికెట్ల ముందు ఎల్బీ రూపంలో దొరికిపోయి పెవీలియన్ కు చేరాడు. మొత్తం 165 బంతులాడిన కోహ్లీ 10 ఫోర్ల సాయంతో 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదవ వికెట్ రూపంలో వెనుదిరగగా, తదుపరి సాహా వచ్చి రహానేతో జత కలిశాడు. ప్రస్తుతం రహానే 69 పరుగుల వద్ద ఉండగా, భారత స్కోరు 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు కాగా, లీడ్ 426 పరుగులకు చేరింది. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ కు 3, అబాట్, తాహిర్ లకు చెరో వికెట్ లభించాయి.

  • Loading...

More Telugu News