: దూకుడుగా రహానే, నిదానంగా కోహ్లీ... భారత్ లీడ్ 415
నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆటగాళ్లు తమ ఆధిక్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. 52 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన రహానే దూకుడుగా ఆడుతుండగా, 83 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ నిదానంగా ఆడుతున్నాడు. మోర్కెల్ బౌలింగ్ లో ఒకటి, అబాట్ బౌలింగ్ లో మరో ఫోర్ కొట్టిన రహానే తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పగా, కోహ్లీ సింగిల్స్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు 84 ఓవర్లలో 202/4. కాగా, భారత లీడ్ 415 పరుగులు. కోహ్లీ 86, రహానే 61 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లీ సెంచరీ చేయగానే భారత్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.