: పొదుపు మొత్తాలపై తగ్గనున్న వడ్డీ!... ఆచితూచి అడుగేయాలనుకుంటున్న జైట్లీ


భారత ప్రజలు తమ నెలవారీ సంపాదనలో మిగుల్చుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో దాచుకునే చిన్న మొత్తాలపై ఇస్తున్న వడ్డీ రేట్లను, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలపై వడ్డీని తగ్గించే ఆలోచన రిజర్వ్ బ్యాంకు చేస్తుండగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం ప్రకటించే ముందు ఆచితూచి అడుగు వేయాలని ఆయన భావిస్తున్నారు. బ్యాంకులపై ఉన్న ఒత్తిడిని తగ్గించాలని ఆర్బీఐ భావిస్తున్నప్పటికీ, ఎంతో మంది పేదలు, చిరుద్యోగుల పొదుపు ఖాతాలపై వడ్డీ గురించి ఆలోచించే ముందు మరోమారు అన్ని వర్గాల అభిప్రాయాలనూ తెలుసుకుంటామని ఆయన అన్నారు. సుకన్యా సమృద్ధి వంటి స్కీముల్లో అత్యధికంగా 9.2 శాతం వడ్డీ లభిస్తోందని గుర్తు చేసిన ఆయన, ఆర్బీఐ పరపతి నిర్ణయాలకు అనుగుణంగా తమ ఆదేశాలు ఉంటాయని వివరించారు. 7వ వేతన సంఘం సిఫార్సులు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు కారణంగా కేంద్ర ఖజానాపై భారం పెరగనుందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News