: వైకాపాలో చేరిన వరంగల్ టీడీపీ నేత దొమ్మాటి


వరంగల్ ఉప ఎన్నికల తరువాత టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో దొమ్మాటి పార్టీలో చేరి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విధానాలను దొమ్మాటి తీవ్రంగా ఆక్షేపించారు. ఒకప్పుడు నిరుపేదల పక్షాన నిలిచిన టీడీపీ, ఇప్పుడు వారికి దూరమైందని ఆరోపించారు. ఎందరో నేతలు తెలుగుదేశంలో ఉంటూ, టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం పోయిందని వెల్లడించారు. కాగా, దొమ్మాటి వైకాపాలో చేరడంతో వరంగల్ పరిధిలో వైకాపా మరింతగా బలోపేతమైందని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News