: మన్యాన్ని వణికిస్తున్న చలి పులి!


విశాఖ మన్యాన్ని చలి పులి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు మన్యం మొత్తాన్నీ కప్పేయగా, ఈ సీజన్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నేడు నమోదయ్యాయి. మినుములూరులో 8 డిగ్రీలు, డల్లపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తదుపరి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలావుండగా, చలిలో మన్యం అందాలను తిలకించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, బొర్రా గుహలు తదితర ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కడుతున్నారు.

  • Loading...

More Telugu News