: ఇంద్రాణి జీవితంలో ఇద్దరు ఐపీఎస్ లు, ఓ బ్రిటన్ వ్యాపారవేత్త కూడా... సీబీఐకి వెల్లడించిన ప్రియుడు
భారత వ్యాపార ప్రపంచంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాఫ్తును సీబీఐ తీసుకున్న తరువాత ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంద్రాణి గత జీవితం గురించిన మరికొన్ని వాస్తవాలను ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అభిజిత్ సేన్ సీబీఐకి వెల్లడించారు. సంజీవ్ ఖన్నాను వివాహం చేసుకోక పూర్వం 1998-99 నుంచి తమకు పరిచయం ఉందని, తొలుత స్నేహితులుగా ఉన్న తాము, ఆపై మరింత దగ్గరయ్యామని సేన్ వెల్లడించినట్టు 'ది క్వింట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీరి మధ్య సంబంధం నడుస్తున్న సమయంలోనే ఓ బ్రిటన్ వ్యాపారవేత్త, ఇద్దరు ఐపీఎస్ అధికారులు, నావీలో జరిగిన 'వార్ రూం లీక్' కేసు నిందితుడితోనూ ఇంద్రాణి శారీరక బంధం పెట్టుకుందట. సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాలతో పెళ్లి తరువాత కూడా అప్పుడప్పుడూ తాము కలుస్తుండేవాళ్లమని సేన్ వెల్లడించినట్టు సమాచారం. సంజీవ్ ఖన్నా అతిగా తాగుతుండటం, తాగిన తరువాత అతని ప్రవర్తన నచ్చకనే ఇంద్రాణి అతనికి దూరమైందని, పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకున్న రోజున, తన వద్ద నుంచి రూ. 4 లక్షలు అప్పు తీసుకుందని అతను చెప్పినట్టు సమాచారం.