: ఆ దంపతులిద్దరూ మా మద్దతుదారులే: ఐఎస్ఐఎస్ ప్రకటన
కాలిఫోర్నియాలో మారణహోమానికి పాల్పడ్డ దంపతులు తమ మద్దతుదారులే నంటూ ఐఎస్ఐఎస్ గ్రూపు రేడియో 'అల్-బయన్' ప్రకటించింది. ఈ ఘటనకు తమదే బాధ్యత అని పేర్కొంది. ఈ దాడిలో మరణించిన ఆ దంపతులను అమరవీరులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ తాము భగవంతునికి ప్రార్థనలు జరుపుతామని తెలిపింది. కాగా, సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు ఇటీవల కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో 14 మంది అమాయకులను వారు పొట్టనబెట్టుకున్నారు.