: చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మార్చేందుకు నిధుల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెదక్, నల్గొండ జిల్లాలలో ఎంపిక చేసిన చెరువులకు ఈ నిధులు కేటాయించారు. మెదక్ లో పిట్లం, గోసముద్రం చెరువుల అభివృద్ధికి రూ.9.5 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా సూర్యాపేటలోని సద్దుల చెరువు అభివృద్ధికి రూ.10.5 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.