: ఢిల్లీలో ‘లష్కరే’ ముష్కరులు... ప్రముఖులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు స్కెచ్!
దేశ రాజధాని ఢిల్లీలోకి లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారట. ఢిల్లీలోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వారు ఆత్మాహుతి దాడులకు పథక రచన చేశారన్న పక్కా సమాచారంతో నగరంలో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ మీదుగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు దుజానా, ఉకాషాలు ఢిల్లీలోకి ఎంటరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. దీనిపై సమగ్ర వివరాలను అందుకున్న ఢిల్లీ పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.