: సిమ్లాలో ప్రియాంకా గాంధీ... డ్రీమ్ హోమ్ నిర్మాణంపై సునిశిత పరిశీలన
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ నిన్న సిమ్లా వెళ్లారు. నగర శివారులో నిర్మించుకుంటున్న తన డ్రీమ్ హోమ్ ను పరిశీలించేందుకే ఆమె అక్కడికి వెళ్లారట. మహిళా ఆర్కిటెక్ట్ ను వెంటబెట్టుకుని మరీ అక్కడికి వెళ్లిన ప్రియాంకా, నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె అక్కడే చాలా సేపు గడిపారని సమాచారం. ఇక నేడు కూడా ఆమె నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. ఆధునికత, సంప్రదాయ రీతులను మేళవించి తన అభిరుచికి అనుగుణంగా ఓ ఇంటిని నిర్మించుకునేందుకు ప్రియాంక గాంధీ సిమ్లా శివారులోని ఛారాబ్రాలో దాదాపు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వెనువెంటనే నిర్మాణం మొదలుపెట్టిన ఆమె, పనులను పరిశీలించేందుకు తరచూ అక్కడికి వెళుతున్నారు. ఇటీవల తన తల్లి సోనియా గాంధీని తీసుకెళ్లి మరీ తన డ్రీమ్ హోమ్ నిర్మాణ పనులను చూపించారు.